: తండ్రే కాదు గురువు, దైవం నాకు మా నాన్నే: అల్లరి నరేష్
దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తనకు తండ్రి మాత్రమే కాదని గురువు, దైవం అని అల్లరి నరేష్ అన్నారు. సంక్రాంతి సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... తన మనసుకి బాగా దగ్గరయిన వ్యక్తి తన తండ్రేనని అన్నారు. తండ్రిగా జన్మనివ్వడమే కాకుండా తాను హీరోగా నిలబడడానికి తన తండ్రి కారణమయ్యారని చెప్పారు. నిర్మాతగా, దర్శకుడిగా తనతో సినిమాలు తీసి హిట్టు సినిమాలిచ్చారని అన్నారు. తనతో ఆయన తీసిన కితకితలు, బెండు అప్పారావు వంటి సినిమాలు ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయని, తనకు పేరు తీసుకొచ్చాయని చెప్పారు.