: 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?


నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఘన విజయం సాధించడంతో ఆయన అభిమానులు సంతోషంగా ఉన్నారు. సినిమాలోని నటీనటులతో పాటు యూనిట్ సభ్యులంతా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించారు. సినిమాను రూ. 50 కోట్ల లోపు బడ్జెట్ తోనే పూర్తి చేశామని చెప్పారు. 'బాహుబలి'కి, 'శాతకర్ణి'కి చాలా తేడా ఉందని తెలిపారు. 'బాహుబలి' అనేది పూర్తిగా ఫాంటసీ చిత్రమని... 'శాతకర్ణి' అనేది చరిత్రలో జరిగిన దాన్ని తెరకెక్కించిన ప్రయత్నమని చెప్పారు.

తాను ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు... ఆ విషయాన్ని రాజమౌళితోనే మొదట పంచుకున్నానని తెలిపారు. ఆ సందర్భంగా, గ్రాఫిక్స్ పైన ఎక్కువగా ఆధారపడవద్దని, దానివల్ల సమయం వృథా కావడమే కాకుండా, పలు సమస్యలు కూడా ఉన్నాయని... ఎంత వీలైతే అంత ఎక్కువగా లైవ్ లోనే షూట్ చేయాలనే సూచనను రాజమౌళి ఇచ్చారని చెప్పారు. అతి తక్కువ రోజుల్లోనే సినిమా పూర్తికావడానికి రాజమౌళి సలహానే కారణమని అన్నారు.

  • Loading...

More Telugu News