: మా ఇంటి ముందు ముగ్గు అదిరిపోయింది: నాగార్జున


తమ ఇంటిముందు అందమైన సంక్రాంతి ముగ్గు వేశారంటూ ప్రముఖ సినీ నటుడు నాగార్జున ట్వీట్ చేశారు. అంతేకాదు, తన సతీమణి అమలతో కలసి ముగ్గు దగ్గర దిగిన ఫొటోను అప్ లోడ్ చేశారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు ప్రిన్స్ మహేష్ బాబు "మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ ట్వీట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్, వెన్నెల కిషోర్, దర్శకుడు హరీష్ శంకర్ లు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. 

  • Loading...

More Telugu News