: ఇంట్లో గంజాయి పెంచుతున్న బీఫార్మసీ విద్యార్థి అరెస్ట్
బయట పెంచితే ఈజీగా దొరికిపోతామని అనుకున్నాడో ఏమో ఏకంగా ఇంట్లోనే గంజాయి సాగు మొదలు పెట్టాడో విద్యార్థి. అది కూడా ఎక్సైజ్ కార్యాలయం సమీపంలోనే కావడం గమనార్హం. వాసన పసిగట్టిన పోలీసులు అతడి ఇంటిపై దాడిచేసి అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ లో అస్సాంకు చెందిన హసన్ బీఫార్మసీ చదువుతున్నాడు. ఎక్సైజ్ కార్యాలయానికి సమీపంలో ఓ ఇంట్లో ఉంటూ పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంటిపై దాడిచేసి కుండీల్లో పెంచుతున్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.