: వచ్చేస్తున్నాయ్ ట్యాంపర్ ప్రూఫ్, క్విక్ రెస్పాన్స్ కోడ్ పాన్ కార్డులు
ఇకపై మార్చడానికి వీల్లేని కొత్త పాన్ కార్డులు జారీ కానున్నాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో వివరాలు ఉండే వీటిని ఎన్ఎస్డీఎల్, యూటీఐఐటీ ఎస్ఎల్ ముద్రిస్తున్నాయని ఆదాయపు పన్ను శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ కార్డులను ట్యాంపర్ ప్రూఫ్ గా పేర్కొన్న ఆయన, వెరిఫికేషన్ ప్రక్రియలో సాయపడే క్విక్ రెస్పాన్స్ కోడ్ ఇందులో ఉంటాయని వివరించారు. ప్రస్తుతం దేశంలో 25 కోట్ల మందికి పాన్ కార్డులు ఉన్నాయని, ఏటా మరో 2.5 కోట్ల మందికి కొత్త కార్డులు జారీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కొత్త లుక్ కలిగిన పాన్ కార్డుల జారీ ప్రారంభమైందని సదరు అధికారి పేర్కొన్నారు.