: తెలంగాణలో పాలన సరిగా లేదు: కోదండరామ్
తెలంగాణలో పాలనపై జేఏసీ చైర్మన్ కోదండరామ్ మరోమారు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పాలన సరిగా లేదని విమర్శించారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని, సీమాంధ్ర పాలన నచ్చకే తెలంగాణ తెచ్చుకున్నామని, ప్రతి ఒక్కరికీ చదువు, వైద్యం, ఉద్యోగం అందాలన్నదే తమ కమిట్ మెంట్ అని అన్నారు. కాగా, ఫార్మాసిటీ నిర్మాణం కోసం వేలాది ఎకరాలు తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోందంటూ ఇటీవల ఆయన నిరసన తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన ధర్నాకు మద్దతు ఇస్తున్న వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కోదండరామ్ తన నివాసంలో కొన్ని గంటల పాటు మౌన దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.