: పోలీసుల అదుపులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు.. విడుదల చేయాలంటూ చెవిరెడ్డి బైఠాయింపు
తిరుపతిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఫ్లెక్సీల గొడవ ముదిరింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, మాజీ మంత్రి గల్లా అరుణ ఫ్లెక్సీలను చింపివేశారంటూ పోలీసులకు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ కి చెందిన ఆరుగురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిని నిరసిస్తూ ఎంఆర్ పల్లి పీఎస్ ఎదుట వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి బైఠాయించారు. అయితే, తమ ఫ్లెక్సీలు, వాహనాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆరోపిస్తుండటం గమనార్హం.