: కరీంనగర్ లో భారీ డంప్ లభ్యం: సీపీ కమలాసన్ రెడ్డి
కరీంనగర్ జిల్లా విద్యారణ్యపురిలో భారీ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ, మాజీ మావోయిస్టు జడల నాగరాజుకు చెందిన డంప్ లభ్యమైందని, ఎనిమిది రకాల ఆయుధాలు, భారీగా బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నాగరాజు బంధువు రాములు పలు సెటిల్ మెంట్లు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేశామన్నారు. జడల నాగరాజు ఆచూకీపై తమ వద్ద ఎటువంటి సమాచారం లేదని, అయితే, ఆయన అదృశ్యమైనప్పటి నుంచి తన సన్నిహితులతో మాట్లాడినట్టు మాత్రం తమకు తెలుసని కమలాసన్ రెడ్డి చెప్పారు.