: రాహుల్ ను కలిసిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసినట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ లో ప్రస్తుత రాజకీయాలపై రాహుల్ కు వివరించానని,టీ పీసీసీ చేపట్టిన కార్యక్రమాలను వివరించానని చెప్పారు. త్వరలో డీసీసీ అధ్యక్షులను నియమిస్తామని, పీసీసీ ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై రాహుల్ సూచనలు చేశారని అన్నారు. కాగా, రాహుల్ ను ఉత్తమ్ కుమార్ కలిసిన సందర్భంలో ఆయన వెంట కోదాడ ఎమ్మెల్యే, ఆయన భార్య పద్మావతి రెడ్డి కూడా ఉన్నారు.