: ‘ ప్రిన్స్’తో సరదాగా మైదానంలో తిరిగిన కోహ్లీ!


టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి శునకాలంటే ఎంత ఇష్టమనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన పెంపుడు శునకం బ్రూనోతో దిగిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో తరచుగా కోహ్లీ పోస్ట్ చేస్తుండటం తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఇంగ్లాండ్ తో తొలి వన్డేకు సిద్ధమవుతున్న టీమిండియా పుణెలోని మైదానంలో ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా స్టేడియంలో భద్రత నిమిత్తం జాగిలాలను అక్కడికి తీసుకువచ్చారు. అందులో, ‘ప్రిన్స్’ అనే జాగిలాన్ని ఇష్టపడ్డ కోహ్లీ, దీంతో, సరదాగా మైదానంలో తిరిగాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారాయి. కాగా, ఇంగ్లాండ్ తో టీమిండియా తొలి వన్డే ఆదివారం జరగనుంది.

  • Loading...

More Telugu News