: అమెరికా ఆరోపణలు తప్పు.. సిరియాలో సైన్యాన్ని పెంచే ఆలోచన మాకు లేదు: రష్యా
సిరియా నిండా సైన్యాన్ని, యుద్ధ విమానాలను రష్యా నింపేస్తోందని.. గత సోమవారం నాలుగు సు-25 యుద్ధ విమానాలు సిరియాలో దిగాయని అమెరికా అధికారులు ఆరోపించడాన్ని రష్యా ఖండించింది. అమెరికా అధికారుల ఆరోపణల్లో నిజం లేదని తెలిపింది. సిరియాలో ఉద్దేశపూర్వకంగా సైన్యాన్ని పెంచే ఆలోచన తమకు లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి సిరియాలో తమ సైన్యాన్ని తగ్గించుకుంటున్నామని... యుద్ధ విమానాలను కూడా ఒక్కొక్కటిగా తగ్గిస్తున్నామని తెలిపింది.