: ఒంటరిగా యుద్ధ విమానాన్ని నడిపిన వాయుసేన చీఫ్
భారత వాయుసేనకు చీఫ్ గా ఇటీవల నియమితులైన బీఎస్ ధనోవా, మిగ్-21 యుద్ధ విమానాన్ని స్వయంగా నడిపారు. రాజస్థాన్ లోని ఉత్తర్ లాయ్ లో ఉన్న వాయుసేన బేస్ నుంచి మిగ్ - 21 టైమ్ 96 విమానాన్ని ఆయన నడిపినట్టు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన, తన పాత విధుల్లోకి వెళ్లి, యుద్ధ విమానం నడిపారని, ఇక్కడి వాతావరణ పరిస్థితులను గగనం నుంచి పరిశీలించారని పేర్కొంది.
కాగా, కార్గిల్ యుద్ధం జరిగిన సమయంలో ధనోవా ఇదే రకం విమానాల పైలెట్ గా విధులు నిర్వహించారు. అప్పట్లో ఆయన రాత్రి పూట పాక్ స్థావరాలపై స్వయంగా దాడులు జరిపారు కూడా. ఆయన చూపిన ధైర్యానికి భారత ప్రభుత్వం యుద్ధ సేవా మెడల్ ను ఇచ్చి సత్కరించింది. ఇదిలావుండగా, దేశంలోని మిగ్-21 విమానాలను ఈ సంవత్సరం నుంచి 2020లోగా తొలగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింద.