: రాజమౌళి ప్రశంస ఆనందాన్ని కలిగిస్తోంది: క్రిష్
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాపై రాజమౌళి స్పందించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని దర్శకుడు క్రిష్ తెలిపారు. విజయవాడలో కనదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. సినిమాకు హిట్ టాక్ రావడం సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. థియేటర్ లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూడటం గొప్ప అనుభూతిని కలిగించిందని తెలిపారు. ఈ సినిమా అతి తక్కువ రోజుల్లో పూర్తి కావడానికి బాలకృష్ణ ఎంతో సహకరించారని చెప్పారు.
'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను 79 రోజుల్లోనే పూర్తి చేశారంటే నమ్మలేకపోతున్నానని రాజమౌళి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. సినిమా ఓ అద్భుత కావ్యంలా ఉందంటూ ఆయన ప్రశంసించారు. 12 కోట్ల మంది తెలుగువారు గర్వపడేలా సినిమాను తెరకెక్కించారని అన్నారు.