: చిరంజీవి సినిమాపై మరో విమర్శ చేసిన వర్మ
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి ట్విట్టర్ ద్వారా వర్మ విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరో ట్వీట్ చేశాడు. అరువు తెచ్చుకున్న కథతో తెలుగు సినీపరిశ్రమను ఓ సినిమా పదేళ్ల వెనక్కి తీసుకెళ్లిందంటూ 'ఖైదీ'ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బాలయ్య 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాపై మరోసారి ప్రశంసలు కురిపించారు. 2000 సంవత్సరాల పాత ఒరిజినల్ స్టోరీతో తెలుగు సినిమాను 'శాతకర్ణి' పదేళ్ల ముందుకు తీసుకెళ్లిందని వర్మ తన ట్వీట్ లో పేర్కొన్నారు.