: గాంధీ - నెహ్రూ కుటుంబంలో తెలివి తక్కువ వ్యక్తి రాహులే!: ఆర్ఎస్ఎస్


గాంధీ - నెహ్రూల కుటుంబంలో తెలివి తక్కువ వ్యక్తి  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీయేనంటూ ఆర్ఎస్ఎస్ నేత రాకేశ్ సిన్హా విమర్శించారు. ప్రధాన మంత్రి మోదీపైన, ఆర్ఎస్ఎస్ పైన రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయన ఈ విమర్శలు చేశారు. ఈ సందర్భంగా రాకేశ్ సిన్హా మాట్లాడుతూ, గాంధీ -  నెహ్రూ కుటుంబంలో ఉన్న రాజకీయ నాయకుల లాగా రాహుల్ గాంధీకి మానసిక పరిపక్వత లేదని విమర్శించారు. దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ ఎప్పుడూ కూడా ఆర్ఎస్ఎస్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని అర్థం చేసుకోవాలంటే, దేశ రాజకీయాలను రాహుల్ గాంధీ మొదట నేర్చుకోవాల్సిన అవసరం ఉందని రాకేశ్ సిన్హా సలహా ఇచ్చారు. 

  • Loading...

More Telugu News