: ‘ఊహించని రీతిలో స్పందన‘... గౌతమిపుత్ర శాతకర్ణిపై ప్రేక్షకుల అద్భుత స్పందనపై బాలయ్య
నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు విడుదలయి అభిమానుల మంచి స్పందన అందుకున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటికే పలువురు సినీప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రోజు హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్ కు బాలయ్యతో పాటు సినిమా దర్శకుడు క్రిష్, నటి శ్రియా వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో బాలకృష్ణ మాట్లాడుతూ... అద్భుతమై స్పందన వచ్చిందని అన్నారు. తాను కూడా ఇంతటి స్పందనను ఊహించలేదని అన్నారు. మన రాష్ట్రంలోని ప్రేక్షకులతో పాటు ఈ సినిమా విడుదలైన పలు రాష్ట్రాల, విదేశాల ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్నారని ఆయన అన్నారు. ఇది తెలుగువారి విజయం అని గర్వంగా చెప్పుకుంటున్నానని అన్నారు. ఏదో కనపడని అదృశ్య శక్తులు ఈ సినిమాను నడిపించాయని తాను ఆనాడే చెప్పానని వ్యాఖ్యానించారు. ఈ సినిమా ఇంతటి ఘనవిజయం కావడానికి కారణమైన తోటి కళాకారులకి, క్రిష్‌కి ధన్యావాదాలు చెబుతున్నానని అన్నారు.