: ఆరు నెలలుగా జగన్ పనీపాటా లేకుండా తిరుగుతున్నాడు: ఎమ్మెల్యే జలీల్‌ఖాన్


వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పూర్తి చేయ‌లేని ప‌నుల‌ను ఆంద్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు పూర్తి చేస్తున్నార‌ని టీడీపీ ఎమ్మెల్యే జ‌లీల్‌ఖాన్ అన్నారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... పులివెందులలో వైఎస్‌ కుటుంబం రక్తం కారిస్తే ఇప్పుడు చంద్రబాబు మాత్రం ఆ ప్రాంతంలో నీళ్లు పారిస్తున్నారని ఆయ‌న అన్నారు. వైసీపీ అధినేత‌ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఆరు నెలలుగా పనీపాటా లేకుండా తిరుగుతున్నాడని, ముఖ్య‌మంత్రిపై త‌రచూ నోరుపారేసుకుంటున్నార‌ని, బంగాళాఖాతంలో చంద్ర‌బాబును కలిపేస్తానని వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అనంత‌రం ప‌లువురు టీడీపీ నేత‌లు మాట్లాడుతూ.. జ‌గ‌న్‌నే ప్రజలు నల్లసముద్రంలో కలిపేస్తారని వ్యాఖ్యానించారు. టీడీపీ స‌ర్కారు పట్టిసీమను పూర్తి చేయ‌డంతో 13 లక్షల ఎకరాల కృష్ణా డెల్టా నిల‌బ‌డిందని అన్నారు. నాడు కేవీపీ కమీషన్ల‌ కోసం జల యజ్ఞానికి, ప్రభుత్వ పథకాలకు మ‌ధ్య ఓ ద‌ళారిలా పని చేశార‌ని ఆరోపించారు.

  • Loading...

More Telugu News