cricket: ఇయాన్ చాపెల్ పై షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం


పాకిస్థాన్ క్రికెట్ టీమ్ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జరిగిన మూడు టెస్టుల సిరీస్లో ఘోరంగా విఫ‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. దీంతో పాక్ జట్టులో సరైన కెప్టెన్ లేడ‌ని, మిస్బా ఉల్ హక్ నుంచి పాక్‌ జట్టు స్ఫూర్తి పొందలేదని, ఇక పాక్ జ‌ట్టు ఇంట్లో కూర్చోవడమే మంచిదంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఇయాన్ చాపెల్ విమ‌ర్శ‌లు చేశాడు. ఈ నేప‌థ్యంలో త‌మ దేశ జ‌ట్టుపై ఆయ‌న‌ చేసిన విమర్శలపై పాకిస్థాన్ మాజీ ఆట‌గాడు షోయ‌బ్ అక్త‌ర్ మండిప‌డ్డాడు. త‌మ దేశ‌ జట్టు ఆస్ట్రేలియాకు కామెడీ చేయడానికి వెళ్ల‌లేద‌ని వ్యాఖ్యానించాడు.

పాక్ జ‌ట్టు కాంపిటీటివ్ గేమ్ ఆడేందుకు వెళ్లింద‌ని ఆయ‌న‌ తెలుసుకోవాలని అన్నాడు. ఆస్ట్రేలియా ఆట‌గాళ్లు బాగా ఆడ‌తార‌ని తాను కూడా ఒప్పుకుంటున్న‌ట్లు తెలిపాడు. అయితే, ఓటములు స‌హ‌జ‌మ‌ని, క్రికెట్ గేమ్ రూపొందించిన ఇంగ్లండ్ ఎప్పుడైనా వన్డే ప్రపంచ కప్ సాధించిందా? అని అడిగాడు. వ‌న్డే క‌ప్ గెల‌వ‌డం లేద‌ని వాళ్లు ఇంట్లో కూర్చుంటున్నారా? అని అడిగాడు. తమ‌జ‌ట్టు కొన్ని నెలల కిందట ఇంగ్లండ్ పై 2-2తో సిరీస్ డ్రా చేసుకున్న విషయం ఆయ‌న‌కు తెలియదా? అని ప్రశ్నించాడు.
పాకిస్థాన్ జ‌ట్టులో ప్ర‌స్తుతం ఫీల్డింగ్ లోపం ఉంద‌ని చెప్పాడు.

  • Loading...

More Telugu News