: రూ. లక్ష పెట్టి 'గౌతమీపుత్ర' టికెట్ కొన్న వీరాభిమాని!
పక్కనే బాలకృష్ణ, దర్శకులు క్రిష్, రాజమౌళి వంటి వారు కూర్చుంటే... వీరందరితో కలసి 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను చూస్తే... ఓహ్ .. అదొక అద్భుతమైన అనుభవం! ఈ కలను నిజం చేసుకున్నాడో వీరాభిమాని. ఈ ఉదయం హైదరాబాద్ లోని ఓ థియేటరులో చిత్ర ప్రముఖులతో పాటు సినిమా చూసేందుకు గోపీచంద్ అనే బాలకృష్ణ వీరాభిమాని రూ. 1,00,100 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. బాలకృష్ణ కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి విరాళంగా లక్షకు పైగా ఇచ్చి టికెట్ కొన్నట్టు గోపీచంద్ వెల్లడించాడు. కాగా, సినిమా తొలి ఆటను చూసేందుకు పలువురు దర్శకులు, యువ హీరోలు పోటెత్తారు. ఈ సందర్భంగా అభిమానుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.