: ఒబామా వ్యాఖ్యలతో ఉద్వేగానికి గురైన కుమార్తెలు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చివరి సందేశం కుటుంబ సభ్యులను ఉద్వేగానికి గురిచేసి కళ్లలో నీళ్లు రప్పించింది. నేడు ఒబామా చికాగోలో అధ్యక్షుడిగా దేశ ప్రజలకు చివరి సందేశం వినిపించారు. ఈ సందర్భంగా తనను అధ్యక్షుడిగా ఆదరించిన ప్రజలు, సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు తోడు నీడగా నిలిచిన కుటుంబ సభ్యులను కూడా అభినందించారు. సుదీర్ఘ కాలం మంచి భార్యగా మాత్రమే కాకుండా, తన పిల్లలకు మంచి తల్లిగా, తనకు ప్రియమైన స్నేహితురాలిగా ఉన్న మిషెల్ ఒబామాకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడిన తన కుమార్తెలు మాలియా, షాషాలకు సారీ చెప్పారు. ఈ సందర్భంగా మాలియా, మిషెల్ భావోద్వేగానికి గురయ్యారు. మాలియా ఉబికివస్తున్న కన్నీటిని కష్టంమీద ఆపుకోవడం విశేషం.