janaganamana: థియేటర్ లో జాతీయగీతం ప్రదర్శిస్తున్న సమయంలో నిల్చోలేదని ముగ్గురిపై ప్రేక్షకుల దాడి


దేశంలోని అన్ని సినిమా థియేటర్‌లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం ప్రదర్శించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. పౌరుల్లో జాతీయ‌తాభావాన్ని నింపేందుకు సుప్రీంకోర్టు చేసిన ఈ సూచ‌న‌ను కొంద‌రు పాటించ‌కుండా మొండిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. థియేట‌ర్‌లో జాతీయ గీతం ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న‌ప్పుడు లేచి నించోలేద‌ని ఇటీవ‌లే చెన్నయ్‌లో కొంద‌రు యువ‌తీయువ‌కులపై కేసు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా ఈ రోజు అటువంటి ఘ‌ట‌నే మ‌రొక‌టి అదే చెన్న‌య్‌లో చోటు చేసుకుంది. చెన్నయ్ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సందర్భంగా అక్కడి థియేటర్‌లో ఓ సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే ఆ చిత్రం ప్ర‌ద‌ర్శ‌న‌కు ముందు జాతీయ గీతం ప్రదర్శిస్తుండగా ముగ్గురు వ్యక్తులు లేచి నిల్చునేందుకు ఒప్పుకోలేదు. జాతీయగీతంపై గౌర‌వం లేకుండా మొండిగా వ్య‌వ‌హ‌రిస్తోన్న‌ వారి తీరు ప‌ట్ల‌ నిర్వాహకులు, ప్రేక్షకులకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News