: నేను రెడ్డిని కాదా?...జగనే రెడ్డా?: జేసీ సూటి ప్రశ్న
ఇక్కడందరూ రెడ్లు రెడ్లు అంటుంటారని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కడప జిల్లా సింహాద్రిపురం మడలం పైడిపాలెంలో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, తాను నిఖార్సైన రెడ్డినని చెప్పారు. తాను కంత్రీ రెడ్డిని కాదని, అసలు సిసలు రెడ్డినని ఆయన తెలిపారు. 'మరి, మాకు పోటీ ఎందుకు పెడతారు, మీరు? మేమూ రెడ్లమే కదా! మాకు పోటీ పెట్టకండి, మా స్థానాలు మాకు వదిలెయ్యండి' అని ఆయన జగన్ కు సూచించారు.
ఆ విధంగా జనగ్ రెడ్లపై పోటీ పెట్టకుండా వదిలిపెడితే...జైజైజై రెడ్లు అని తాను కూడా నినాదాలు చేస్తానని ఆయన అన్నారు. మాట్లాడితే రెడ్లకు రెడ్లకు పోటీ పెడతారు. ఈ కులం, వర్గం అన్నీ పక్కనపెట్టి ప్రజలు ఆలోచించాలని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో లారీ పళ్ళు అమ్మితే, రెండు టన్నులు ...మూడు టన్నులు సూట్ అంటున్నారని ఆయన మండిపడ్డారు. టన్ను చీనా కాయలు 80 వేల ధర పలుకుతాయని, అయితే దళారులు మాత్రం సూట్ అంటూ దోచుకుంటున్నారని, పోలీసుల్ని ఉపయోగించి ఈ సూట్ అనే వాళ్లను కంట్రోల్ చేయాలని జేసీ సీఎంకు సూచించారు.