: సినీ రంగానికి సంపూర్ణేష్ బాబు సూచన!


చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి సినీ రంగం ముందుకు రావాలని సినీ నటుడు సంపూర్ణేష్ బాబు విన్నవించారు. చేనేత వస్త్రాలను ఉపయోగించడం ద్వారా చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలవాలని కోరాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టెస్కో స్టాల్ లో చేనేత దుస్తులను ఈ రోజు ఆయన కొనుగోలు చేశారు. అంతేకాదు, జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ను కలిసి, అధికారులంతా వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు చేపట్టడాన్ని అభినందించారు. 

  • Loading...

More Telugu News