: పంజాబ్ సీఎం పై బూటు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి!
పంజాబ్ సీఎం, అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ పై గుర్తుతెలియని వ్యక్తి బూటు విసిరిన సంఘటన సంచలనం రేపింది. బటిండాలో బుధవారం నిర్వహించిన జనతా దర్బార్ లో ప్రసంగిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తి ఒకరు ఆయనపైకి బూటు విసిరాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, బాదల్ కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం ఇది రెండోసారి. 2014లో ఖన్నాలో నిర్వహించిన ఓ ఫంక్షన్ కి బాదల్ హాజరైన సందర్భంలో గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై బూటు విసిరాడు.