: రవిశాస్త్రిపై మండిపడ్డ అజారుద్దీన్
భారత క్రికెట్ లో గొప్ప కెప్టెన్లు వీరేనంటూ మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఓ లిస్ట్ ను విడుదల చేసినప్పటినుంచీ ఆయనపై పలువురు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ కూడా రవిశాస్త్రిపై మండిపడ్డారు. భారత జట్టును విజయాల వైపు నడిపించిన సౌరవ్ గంగూలీ పేరును బెస్ట్ కెప్టెన్స్ లిస్ట్ లో చేర్చకపోవడంపై రవిశాస్త్రిపై అజార్ మండిపడ్డాడు. వ్యక్తుల గురించి అతను ఏమనుకుంటున్నాడో అనవసరమని... గంగూలీ ఎంత గొప్పవాడో అతని గణాంకాలే చెబుతాయని అన్నాడు. జాబితా తయారు చేసేటప్పుడు వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టాలని, టీమ్ కు ఎన్నో విజయాలను అందించిన వారిని కించపరచకూడదని సూచించారు.