: మరింత గడ్డుకాలం రానుంది: పెద్దనోట్ల రద్దుపై మరోసారి స్పందించిన మన్మోహన్ సింగ్
ఇటీవల ముగిసిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పెద్దనోట్ల రద్దుపై ప్రసంగం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ రోజు మరోసారి పెద్దనోట్ల రద్దుపై స్పందించారు. ఈ రోజు ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దు చర్య మన జీడీపీపై తీవ్రంగా ప్రభావం చూపుతోందని ఆర్థిక వేత్తలు ఇప్పటికే చెప్పారని, దాన్ని బట్టే పెద్దనోట్ల రద్దు ఎటువంటి ప్రభావాన్ని చూపనుందో తెలుస్తోందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు తరువాత దేశ ఆర్థిక వ్యవస్థలో ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయని తెలిపారు. దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని అన్నారు. మోదీ అనుసరిస్తోన్న విధానాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమవుతుందని చెప్పారు. పెద్దనోట్ల రద్దు వల్ల భవిష్యత్తులో మరింత గడ్డుకాలం రానుందని తెలిపారు.