: జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఇవ్వండి... కేంద్ర ప్రభుత్వానికి శశికళ లేఖ
తమిళనాడులో నిర్వహించే జల్లికట్టును ఈ సారి కూడా నిర్వహించేలా చూడడానికి ఆ రాష్ట్ర నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఈ రోజు ఓ లేఖ రాశారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు జారీ చేయాలని ఆమె లేఖలో పేర్కొన్నారు. జల్లికట్టు విషయంలో ప్రధాని వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. తమ రాష్ట్రంలో జల్లికట్టు సంప్రదాయ క్రీడ అని, సంక్రాంతి సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లో దాన్ని నిర్వహించడం పండగలో భాగంగా పరిగణిస్తారని ఆమె తెలిపారు.