: ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం నాకు లేదు!: చంద్రబాబు


ప్రజల కోసం పని చేయడంలో ఉన్న తృప్తే వేరని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేవలం పదవుల కోసం తానెప్పుడూ పని చేయలేదని చెప్పారు. పదవులే తనకు ముఖ్యమైతే ప్రధాని పదవిని ఎప్పుడో చేపట్టేవాడినని తెలిపారు. ప్రధాని అయ్యే అవకాశం తనకు రెండుసార్లు వచ్చినా, కాదనుకున్నానని చెప్పారు. తాను ప్రధానమంత్రిని కావాలనుకుంటే దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ల కంటే ముందుగానే అయ్యేవాడినని చెప్పారు. తన పరిమితులు తనకు తెలుసని... రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేయడమే తనకు తెలుసని చెప్పారు.

ఏపీలో తన ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని... ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కొందరు చేస్తున్న ఆరోపణలు పసలేనివని బాబు అన్నారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తున్నారని తెలిపారు. అవినీతి ఊబిలో కూరుకుపోయి, జైలుపాలైన వ్యక్తి కూడా తనను వేలెత్తి చూపుతుండటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News