: మీరే కాదు... మరెవరు చెప్పినా వినను!: లాలూకు ఝలక్ ఇచ్చిన అఖిలేష్!
సమాజ్ వాదీ పార్టీని గుప్పెట్లోకి తీసుకుని కన్నతండ్రి ములాయంకే షాక్ ఇచ్చిన అఖిలేష్ సింగ్ యాదవ్... తాజాగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఝలక్ ఇచ్చారు వివరాల్లోకి వెళితే, ములాయం కుటుంబానికి లాలూ ప్రసాద్ వియ్యంకుడు కూడా అన్న సంగతి తెలిసిందే. ఈ చొరవతోనే నిన్న పొద్దుపోయిన తర్వాత అఖిలేష్ కు ఫోన్ చేశారు లాలూ.
ఈ సందర్భంగా, "అఖిలేష్ బాబూ, ఎంతైనా కన్న తండ్రి కదా. ఆయన కష్టం వల్లే పార్టీ ఈ స్థాయిలో నిలబడింది. నాన్నను పార్టీ అధ్యక్షుడిగా అంగీకరించు. ఆయన చెప్పినట్టు విను" అంటూ సలహా ఇచ్చారట. దీనికి సమాధానంగా, "మా మంచి కోరే వ్యక్తిగా మీ మాటను కాదనలేను. కానీ ఇప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఎన్నికలు అయ్యేంత వరకు పార్టీని నేనే నడుపుతా. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత పార్టీ పగ్గాలను నాన్నకు అప్పజెబుతా. అంత వరకు మీరే కాదు... మరెవరు చెప్పినా వినను" అని అఖిలేష్ చెప్పారట. దీంతో, లాలూ షాక్ అయ్యారట.