: నేడు జగన్ ఇలాకాకు చంద్రబాబు... గొడవ చేస్తారేమోనని వైకాపా ఎంపీ అవినాష్ అరెస్ట్


ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు కడప, ఇడుపులపాయల్లో పర్యటించనున్న నేపథ్యంలో నిరసన ప్రదర్శనలు చేయవచ్చన్న అనుమానంతో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పులివెందులలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన్ను నిర్బంధించిన పోలీసులు, బయటకు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే తనను నిర్బంధించారని అన్నారు.

జన్మభూమిలో ప్రజా సమస్యలను ప్రస్తావించేందుకు వస్తే, అరెస్టులు చేయడం అన్యాయమని అన్నారు. పైడిపాలెం రిజర్వాయర్ పనుల్లో 90 శాతం పనులను దివంగత సీఎం రాజశేఖరరెడ్డి పూర్తి చేయిస్తే, తానే నిధులిచ్చినట్టు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలావుండగా, గండికోట ముంపు వాసులకు పరిహారం ఇవ్వాలని పోరాడుతున్న జయశ్రీని పోలీసులు నిన్నటి నుంచే గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News