: తమిళ తంబిలకు గుడ్‌న్యూస్!.. పొంగల్‌కు సెలవు తప్పనిసరి చేస్తూ కేంద్రం ప్రకటన
తమిళ ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాసిన లేఖకు కేంద్రం స్పందించింది. పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని అన్నాడీఎంకే పార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. తమిళ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే పొంగల్ పండుగను నిబంధనలతో కూడిన సెలవు దినంగా కాకుండా తప్పనిసరి సెలవుగా ప్రకటించాలని కోరుతూ అన్నాడీఎంకే చీఫ్ శశికళా నటరాజన్, సీఎం పన్నీర్ సెల్వం ప్రధాని మోదీకి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన కేంద్రం పొంగల్‌ను తప్పనిసరి సెలవుగా ప్రకటించింది.