: ‘శాతకర్ణి’గా బాలయ్య మామయ్య అద్భుతంగా నటించారు: నారా లోకేశ్
‘గౌతమి పుత్ర శాతకర్ణి’లో తన మామయ్య నటన అద్భుతంగా ఉందని టీడీపీ నేత, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో చూశానని, బాలయ్య మామయ్య నటన కట్టిపడేసిందని, ఆయన అభినయం ఉత్తేజపరిచే విధంగా ఉందని అన్నారు. ఈ చిత్రంలో మిగిలిన ఆర్టిస్టులు కూడా బాగా నటించారని ప్రశంసించారు. అమరావతి చరిత్రను ఈ చిత్రం ద్వారా చూడటం చాలా ఆనందం కలిగిస్తోందని, క్రిష్ దర్శకత్వం అద్భుతంగా ఉందని లోకేష్ కితాబు ఇచ్చారు.