: హే.. రోజా! ఊరుకో...వాడిని 'గారు' అంటావేంటి?: చిరంజీవి


ఖైదీ నెంబర్ 150 ప్రమోషన్ సందర్భంగా చిరంజీవిని రోజా ఇంటర్వ్యూ చేస్తూ, 'మీ ఇంట్లో అందరూ హీరోలైపోయారు కదా? ప్రధానంగా బంగారు కోడిపెట్ట పాటను రామ్ చరణ్ గారు చేస్తున్నప్పుడు మీరెలా ఫీలయ్యారు?' అంటూ ప్రశ్నించింది. వెంటనే అందుకున్న చిరంజీవి... 'హే రోజా! ఊరుకో...వాడిని గారు అంటావేంటి?' అని వారించారు. 'పిల్లాడిగా వున్నప్పుడు వాడిని ఎత్తుకున్నావు... చరణ్ అను చాలు' అని సూచించారు.

తన బంగారు కోడిపెట్ట పాటను వాడు రీమేక్ చేసినప్పుడు ఆందోళన చెందినా, అద్భుతంగా చేశాడని, దానిని చూసిన తరువాత చాలా గర్వపడ్డానని చిరంజీవి అన్నారు. తన కంటే ఎక్కువ సురేఖ సంతోషించిందని ఆయన చెప్పారు. దాంతో ఎవరు బాగా చేశారని సురేఖను అడిగితే... 'ఇంకెవరు నా కొడుకే' అంటూ మురిసిపోయిందని చిరంజీవి తెలిపారు. ఎంతైనా తల్లీకొడుకులు కదా? అంటూ ఆయన నవ్వేశారు. దీంతో రోజా కూడా నవ్వేసింది. 

  • Loading...

More Telugu News