: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం... ఆరుగురి దుర్మరణం.. 30 మందికి గాయాలు


ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని 24వ నెంబ‌రు జాతీయ రహదారిపై ఈ రోజు ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ప్రయాణికులతో ఆ ప్రాంతం మీదుగా వెళుతున్న ఓ బస్సు ఒక్క‌సారిగా అదుపుతప్పి ముందుకు దూసుకువెళ్లింది. రోడ్డు పక్కనే నిలిచి ఉన్న మరో బస్సును వేగంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోగా మరో 30 మందికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని పోలీసులు మీడియాకు తెలిపారు. గాయాల‌పాల‌యిన వారిని ద‌గ్గ‌ర‌లోని ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ ప్ర‌మాద‌ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామ‌ని తెలిపారు.

  • Loading...

More Telugu News