: విశాఖ జన్మభూమిలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల ఘర్షణ
విశాఖపట్టణం జిల్లా నక్కపల్లిలో జరిగిన 'జన్మభూమి-మాఊరు' కార్యక్రమంలో టీడీపీ, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పింఛన్ల విషయంలో రెండు పార్టీల కార్యకర్తల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారి, ఘర్షణ వరకు దూసుకెళ్లింది. ఈ సందర్భంగా తమకు అన్యాయం జరుగుతోందంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు అధికారులను నిర్బంధించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఎంపీడీవో కిందపడి స్వల్పంగా గాయపడ్డారు. దీంతో కార్యకర్తలను పోలీసులు నిలువరించి, అధికారులను అక్కడి నుంచి తరలించారు.