: పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగనున్న కేజ్రీవాల్?


పంజాబ్ ఎన్నికల రంగం ఒక్కసారిగా వేడెక్కింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ శిసోడియా చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనం రేపాయి. మొహాలీలో జరిగిన ఓ సభలో ఆయన ప్రసంగిస్తూ అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలంటూ పిలుపునిచ్చారు. దీంతో, పంజాబ్ ఎన్నికల బరిలోకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ దిగబోతున్నారా? అనే చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో మొదలైంది. అయితే, మనీష్ శిసోడియా మాటల్లో వాస్తవం ఎంతవరకు ఉందన్న విషయంలో క్లారిటీ లేదు. ఆప్ నుంచి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. 

  • Loading...

More Telugu News