: వియత్నాంకు క్షిపణులిస్తుంటే, ఉలిక్కిపడుతున్న చైనా!


భూ ఉపరితలంపై నుంచి ఆకాశంలో దూసుకొచ్చే క్షిపణులను గురిచూసి పేల్చేయగల విధ్వంసక 'ఆకాష్'లను వియత్నాంకు విక్రయించాలని ఇండియా భావిస్తున్న వేళ, పాకిస్థాన్ ఉలిక్కి పడుతోంది. జపాన్, వియత్నాం వంటి తమ శత్రు దేశాలతో డీల్స్ కుదుర్చుకుంటూ, ఇండియా ఆయుధాల విక్రయ వ్యాపారంలో శరవేగంగా ఎదుగుతుండటమే చైనా భయానికి కారణమని తెలుస్తోంది. తమకు సరిహద్దుల్లో ఉన్న దేశాలతో ఇండియా వ్యూహాత్మకంగా బంధాన్ని పెంచుకుంటూ ఉండటంపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కాగా, వియత్నాంకు ఆకాష్ క్షిపణులతో పాటు, ఆ దేశం కొనుగోలు చేసిన సుఖోయ్ విమానాలకు పైలట్ శిక్షణను సైతం ఇచ్చేందుకు ఇండియా అంగీకరించిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్జీలో ఇండియా సభ్యత్వానికి మోకాలడ్డుతున్న చైనాకు చెక్ చెప్పాలన్నదే భారత అభిమతం కాగా, ఇండియాను అడ్డుకునేందుకు చైనా యత్నిస్తోంది.

  • Loading...

More Telugu News