: 'ఇండియా టుడే' కోసం తమిళనాడులో చంద్రబాబు


చెన్నై గిండిలోని ఐటీసీ హోటల్ లో నేడు జరగనున్న 'ఇండియా టుడే' సదస్సుకు హాజరయ్యేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెన్నయ్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా, పలువురు టీడీపీ అభిమానులు, ప్రొటోకాల్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. కాగా, ఈ సదస్సును నిన్న అన్నాడీఎంకే జాతీయ కార్యదర్శి హోదాలో శశికళ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సదస్సుకు నాలుగు దక్షిణాది రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జయలలిత చిత్రాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ సైతం ఏర్పాటైంది.

  • Loading...

More Telugu News