: మ‌తం పేరుతో మ‌తిలేని హ‌త్య‌లు.. ఆవేద‌న వ్య‌క్తం చేసిన పోప్ ఫ్రాన్సిస్‌


మ‌తం పేరుతో మతిలేని హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌ముఖ క్రైస్త‌వ మ‌త‌బోధ‌కుడు పోప్ ఫ్రాన్సిస్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జిహాదీలు మ‌తం పేరుతో ప్ర‌తి ఒక్క ప్ర‌దేశంలో మార‌ణ‌హోమం సృష్టిస్తున్నార‌ని అన్నారు. ప్రార్థ‌నా స్థ‌లాల నుంచి మార్కెట్ల వ‌ర‌కు వారు దేనినీ వ‌ద‌ల‌డం లేద‌న్నారు. గ‌తేడాది ఉగ్ర‌వాదులు ప్ర‌పంచంలో భీతావ‌హం సృష్టించార‌న్నారు. దేవుడి పేరుతో మ‌రొక‌రిని చంప‌డం స‌రికాద‌న్నారు. ఉగ్ర చ‌ర్య‌ల‌ను అడ్డుకునేందుకు అన్ని దేశాల ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. అలాగే పేద‌రికాన్ని త‌గ్గించ‌డంపైనా ఆయా దేశాలు దృష్టిసారించాల‌న్నారు. దీనివ‌ల్ల చాంద‌స‌వాదం నశిస్తుంద‌ని పోప్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

  • Loading...

More Telugu News