: పతంగులు ఎగురవేసేందుకు సిద్ధమవుతున్న షారూక్!


సంక్రాంతి పండగ ఎప్పుడు వస్తుందా అని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. ఎందుకంటే, ప్రతి ఏటా ముంబయిలోని తన నివాసం ‘మన్నత్’లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేయడం ఆయనకు ఆనవాయితీ. అయితే, ఈసారి మాత్రం తన అభిమానులకు కూడా పతంగులు ఎగురవేసే అవకాశం కల్పించాడు. మరో ప్రత్యేకత ఏమిటంటే, షారూక్ చిత్రం ‘రయీస్’ లోని ‘ఉడీ ఉడీ జాయే’ పాటను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News