: పవన్ కల్యాణ్ అప్పుడూ, ఇప్పుడు, ఎప్పుడూ అలాగే ఉన్నాడు!: చిరంజీవి
పవన్ కల్యాణ్ ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని చిరంజీవి తెలిపారు. ఖైదీ నెంబర్ 150 సినిమా ప్రమోషన్ సందర్భంగా ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ చిన్నప్పటి నుంచీ అంతేనని, వాడు అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఒకేలా ఉన్నాడని ఆయన చెప్పారు. అయితే పవన్ కల్యాణ్ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ ప్రజలు వాడిని చూసేవిధానం మారిందని, దీంతోనే అభిమానులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. కుటుంబం మొత్తం హాల్లో మాట్లాడుకుంటే...వాడు బెడ్ రూంలో దూరి పుస్తకం చదువుకునేవాడని ఆయన చెప్పారు. మొదటి నుంచి వాడు ఇంట్రావర్ట్ అని, పెద్దగా మాట్లాడడని ఆయన తెలిపారు. ఇప్పుడే పవన్ కల్యాణ్ తో కలిసి రాజకీయాల్లో పనిచేసే అవకాశం లేదని, అయితే ఎప్పటికైనా పనిచేసే అవకాశం ఉండే అవకాశం ఉందని, దానిని ఇప్పుడే చెప్పలేనని ఆయన తెలిపారు.