: విశ్వనాథ్, బాపు, బాలచందర్ వంటి వారితో అద్భుతమైన సినిమాలు...రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి తో విజయవంతమైన సినిమాలు చేశాను: చిరంజీవి
సుదీర్ఘ సినీ కెరీర్ లో విశ్వనాథ్, బాలచందర్, బాపు వంటి దర్శకులతో ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశానని చిరంజీవి తెలిపారు. అలాగే కొదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు వంటి దర్శకులతో మంచి కమర్షియల్ సినిమాలు చేశానని ఆయన అన్నారు. ఎంతో మంది దర్శకులు తనను అభిమానులు ఆశించిన విధంగా చూపించారని ఆయన తెలిపారు. అందుకే చాలా సినిమాలు విజయవంతమయ్యాయని, సినిమాల్లో తాను ఏం చేసినా అభిమానులు ఆదరించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు చేసిన సినిమా తన అభిమానులందర్నీ ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.