: పన్నీర్ సెల్వం అమ్మ గురించే మాట్లాడారు... పక్కనే వున్న చిన్నమ్మ గురించి ఏమీ మాట్లాడలేదు!
ఇండియాటుడే దక్షిణాది సదస్సు-2017 కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ శశికళ ఇద్దరు హాజరయ్యారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం ప్రసంగించారు. తన ప్రసంగం నిండా ఆయన దివంగత జయలలిత గురించే మాట్లాడారు. జయ గొప్పదనం, ఆమె విజన్, ఆమె పథకాలు తదితర విషయాలన్నింటి గురించి మాట్లాడారు. పక్కనే ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ శశికళ గురించి ఒక్క మాట కూడా పన్నీర్ సెల్వం మాట్లాడలేదు. తన ప్రసంగం ప్రారంభంలో మాత్రం... తమ గౌరవనీయులైన జనరల్ సెక్రటరీ చిన్నమ్మ అని సంబోధించారు. ఆ తర్వాత తన ప్రసంగంలో చిన్నమ్మ ఊసు ఎక్కడా ఎత్తలేదు. పన్నీర్ సెల్వం ప్రసంగం అన్నాడీఎంకే శ్రేణుల్లో చర్చను లేవనెత్తింది. తమిళనాడు సీఎం పదవిని శశికళ చేపట్టడం ఖాయం అనే వార్తలు వినిపిస్తున్న తరుణంలో... పన్నీర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది.