: అలాంటప్పుడు బిర్యానీని కూడా బ్యాన్ చేయాలి: కమలహాసన్
తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిషేధించాలనడం సబబు కాదని ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ అన్నారు. స్పెయిన్ లో జరిగే బుల్ ఫైట్ కు, తమిళనాడులోని జల్లికట్టుకు ఎంతో తేడా ఉందని చెప్పారు. బుల్ ఫైట్ లో ఎద్దులు హింసకు గురవుతాయని... ఒక్కోసారి చనిపోతాయని తెలిపారు. కానీ, జల్లికట్టులో ఎలాంటి హింస ఉండదని... తమిళనాడులో ఎద్దులను దేవుడిలా పూజిస్తారని చెప్పారు. జల్లికట్టును నిషేధించాలనుకుంటే బిర్యానీని కూడా బ్యాన్ చేయాలని అన్నారు. బిర్యానీ కోసం మూగజీవాలను చంపడం పాపం కాదా? అని ప్రశ్నించారు.