: కెప్టెన్ గా తప్పుకోవాలని ధోనీని బీసీసీఐ స్వయంగా కోరిందట!


వన్డే, టీ-20 క్రికెట్ జట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు గత వారంలో ధోనీ సంచలన ప్రకటన చేయడం వెనుక బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) హస్తముందా? 'హిందుస్థాన్ టైమ్స్' ప్రచురించిన సంచలన కథనం అవుననే అంటోంది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ స్వయంగా ధోనీని కలిసి రిటైర్ మెంటును ప్రకటించాలని కోరినట్టు పత్రిక తెలిపింది. జార్ఖండ్, గుజరాత్ జట్ల మధ్య రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ నాగపూర్ వేదికగా జరుగుతున్న వేళ, ధోనీని కలిసేందుకు ప్రసాద్ వెళ్లినట్టు పేర్కొంది. ఆపై కెప్టెన్ గా దిగిపోవాలని ప్రసాద్ సూచించాడని, వీరిద్దరి మధ్యా జరిగిన చర్చల తరువాత అదే రోజు ధోనీ తన నిర్ణయాన్ని వెల్లడించాడని 'హిందుస్థాన్ టైమ్స్' తెలియజేసింది.

  • Loading...

More Telugu News