: క్రిష్.. నిన్ను చూస్తే అసూయగా ఉంది.. మరోమారు ట్వీటిన రాంగోపాల్ వర్మ
ట్వీట్లతో నిత్యం వార్తల్లో ఉండే సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మరోమారు ట్వీటారు. అయితే ఈసారి మెగా బ్రదర్ నాగబాబుపై కాదు.. గౌతమిపుత్ర శాతకర్ణి డైరెక్టర్ క్రిష్‌పై. అతడిని చూస్తే తనకు అసూయగా ఉందని పేర్కొన్నాడు. ముంబైలో పెద్ద కార్పొరేట్ కంపెనీ ఒకటి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిందని, జాతీయ, అంతర్జాతీయ హక్కులను అది సొంతం చేసుకుంటోందని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ముంబైలో సింగిల్ షో తోనే క్రిష్ నాలుగు కంపెనీలతో సంతకం చేశాడంటూ తాజా వార్తను బయటపెట్టాడు. అంతేకాదు, 'హే క్రిష్.. నాకు అసూయగా ఉంది'.. అని పేర్కొన్నాడు. క్రిష్ సంతకం చేసిన నాలుగు కంపెనీల్లో ఒకటి 'ఏకే' (అమీర్ ఖాన్)తో సినిమా అని తనకు తెలుసని, రెండోది 'ఎస్‌కే' (సల్మాన్ ఖాన్) అని విన్నానని పేర్కొన్న వర్మ 'అది నిజమో? కాదో కన్ఫర్మ్ చేయాలంటూ' ట్విట్టర్ ద్వారా క్రిష్‌ను అభ్యర్థించారు.