: నాన్నకు ట్రెండ్ తో పనిలేదు.. ఆయన స్టైల్ ఆయనదే!: అక్కినేని నాగ చైతన్య


‘నడుస్తున్న ట్రెండ్ తో నాన్నకు పనిలేదు.. ఆయన స్టైల్ ఆయనదే’ అని ప్రముఖ నటుడు నాగ చైతన్య తన తండ్రి నాగార్జున గురించి అన్నాడు. ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నాగ చైతన్య మాట్లాడుతూ, అన్నమయ్య, శ్రీరామదాసు, షిర్డి సాయి వంటి అద్భుతమైన సినిమాలను దర్శకుడు రాఘవేంద్రరావు తెరకెక్కించారని, అదే కోవలోకి ఈ చిత్రం కూడా వస్తుందని అన్నాడు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను పట్టించుకోకుండా తన  ట్రెండ్ లో నాగార్జున వెళుతుంటారని, అదే ఒక్క ట్రెండ్ లా సెట్ అయిపోతుందని, అదే తనకు ఇన్ స్పిరేషన్ అని అన్నాడు. ‘చైతూ, మీరు కూడా నాన్నగారి బాటలో భక్తిరస చిత్రం చేసే అవకాశం ఉందా?’ అనే ప్రశ్నకు.. 'అందుకు ఇంకా చాలా టైముందండి’ అని నాగ చైతన్య నవ్వుతూ సమాధానమిచ్చాడు.

  • Loading...

More Telugu News