: నిజాయతీగా చెబుతున్నాను.. ఎన్ కౌంటర్ జరిగినప్పుడు అక్కడ ఆర్కే ఉన్నాడని మాకు తెలియదు: డీజీపీ సాంబశివరావు
'ఏవోబీ ఎన్ కౌంటర్ జరిగిన రోజున ఆ ప్రదేశంలో ఆర్కే ఉన్నాడన్న విషయం తమకు అసలు తెలియదని, అసలు ఆర్కే అక్కడ ఉన్నట్లు తమకు సమాచారమే లేదని, ఈ విషయాన్ని నిజాయతీగా చెబుతున్నానని ఏపీ డీజీపీ సాంబశివరావు అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ ల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎన్ కౌంటర్ లో ఆర్కే గాయపడ్డాడని, కనపడటం లేదని, పోలీసుల అధీనంలో ఉన్నాడనే విషయాలు ప్రజాసంఘాల వాళ్లు చెబితేనే తమకు తెలుసని, ఈ విషయం చాలా నిజాయతీగా చెబుతున్నానని అన్నారు. ఆర్కే పై విష ప్రయోగం జరిగిందా? అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ, అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు. తెలంగాణపైనే తమ చూపు ఉండేదని, ఏవోబీపై తమకు అంత పట్టులేదని, దానిపై చిన్నిచూపు ఉండేదని సాంబశివరావు పేర్కొన్నారు.