: జైల్లో ఉన్న ఆర్జేడీ నేత జీన్స్ ఫ్యాంటు, కోటు ధరించి సెల్ఫీ!
ప్రస్తుతం జైల్లో ఉన్న వివాదాస్పద ఆర్జేడీ నేత షాబుద్దీన్ మరో వివాదానికి తెర లేపారు. జైలు గదిలో దర్జాగా సెల్ఫీ దిగి, దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. జైలులో ఉన్న షాబుద్దీన్ ఖైదీ డ్రెసులో కాకుండా, జీన్స్ ఫ్యాంటు, కోటుతో సెల్ఫీ దిగడం గమనార్హం. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన ఈ ఫొటో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో జైలు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మూడు మొబైల్ ఫోన్లు, నాలుగు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.