: బాగ్దాద్ లో దారుణం.. ఆత్మాహుతి దాడిలో 11 మంది మృతి


ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో మరో ఘోరం జరిగింది. బాగ్దాద్ శివారు సదర్ పట్టణంలోని  మార్కెట్ లో కారు బాంబుతో ఆత్మాహుతి దాడికి పాల్పడిన సంఘటనలో 11 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పేలుడు పదార్థాలు నింపిన కారుతో ఉన్న ఒక ఉగ్రవాది మార్కెట్ లోకి చొరబడేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన  సెక్యూరిటీ గార్డు, ఆ కారును ఆపాల్సిందిగా హెచ్చరించాడు. ఎంతకీ వినకపోవడంతో కారుకు గురిపెట్టి కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో కారులో ఉన్న ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.  ఈ సంఘటనలో 11 మంది చనిపోగా, 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. కాగా, ఈ ఘటనకు పాల్పడింది ఎవరనే విషయమై ఏ సంస్థ నుంచి ప్రకటన వెలువడలేదు.

  • Loading...

More Telugu News